విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:19 AM
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
బెలగాం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బెలగాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు గురువారం దోమ తెరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా దోమ తెరలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మలేరియా నివారణ చర్యల్లో భాగంగా వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో దోమ తెరలను అందించడానికి రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ప్రస్తుతానికి 1,700 దోమ తెరలను జిల్లాకు రప్పించినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని దోమతెరలు జిల్లాకు రానున్నాయని అన్నారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి.రాములు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
పార్వతీపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీలో భాగంగా ఆయన గురువారం గోదాంను పరిశీలించారు. గోదాంకు వేసిన సీళ్లు, ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డీఆర్వో హేమలత తదితరులు ఉన్నారు.