Students’ Health విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:20 AM
Special Focus on Students’ Health జిల్లాలోని వసతిగృహ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ .. తుపాన్ ప్రభావంతో వాతావరణంలో వచ్చే మార్పులు దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పార్వతీపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వసతిగృహ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ .. తుపాన్ ప్రభావంతో వాతావరణంలో వచ్చే మార్పులు దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యానికి గురికారాదని తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అవసరమైన మందులు అందించాలని సూచించారు.
ఉచితంగా నిత్యావసర సరుకులు
తుపాన్ ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు జేసీ తెలిపారు. 25 కిలోల బియ్యం, మత్స్యకారులకు 50 కిలోల రైస్, కిలో పప్పు, లీటర్ నూనె, కిలో చొప్పున ఉల్లిపాయలు , బంగాళాదుంపలు, చక్కెర అందిస్తామన్నారు.