Share News

Sickle Cell Anemia సికిల్‌సెల్‌ అనీమియా కేసులపై ప్రత్యేకదృష్టి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:24 AM

Special Focus on Sickle Cell Anemia Cases జిల్లాలో సికిల్‌సెల్‌ అనీమియా కేసులపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. సికిల్‌సెల్‌ అనీమియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

  Sickle Cell Anemia  సికిల్‌సెల్‌ అనీమియా కేసులపై ప్రత్యేకదృష్టి
మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సికిల్‌సెల్‌ అనీమియా కేసులపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. సికిల్‌సెల్‌ అనీమియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. గర్భిణుల నమోదులో జాప్యం జరగరాదన్నారు. సంక్రమిత వ్యాధుల సర్వే పక్కాగా చేపట్టాలన్నారు. భద్రగిరి, సాలూరు , కురుపాం ఆసుపత్రుల అదనపు భవనాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు ఐదు అంబులెన్స్‌లు, ఒక సంచార ఎక్స్‌రే యూనిట్‌ వచ్చాయని వాటిని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మొండెంఖల్లు తదితర పీహెచ్‌సీల్లో శతశాతం ప్రసవాలు జరగడంపై వైద్యాధికారులను అభినందించారు.ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు, ప్రోగ్రాం అధికారులు ఎం.వినోద్‌, జగన్మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు తదితరులున్నారు.

అసంపూర్తి గృహ నిర్మాణాలకు అదనపు సాయం

అసంపూర్తి ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం అదనపు సాయం అందించనుందని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ బుధ వారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 10,717 గృహాల పనులు పూర్తి చేయడానికి ఇది మంచి అవకాశమన్నారు. యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలు కాగా ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నారని వెల్లడించారు. పీఎంఏవై 1.0 కింద ఇళ్లు మంజూరై నిర్మాణాలు పూర్తిచేయని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Mar 13 , 2025 | 12:24 AM