Share News

Pending Cases పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:10 PM

Special Focus on Pending Cases పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. బుధవారం పోలీస్‌ సమావేశ మందిరంలో పోలీస్‌ అధికారులు, సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

  Pending Cases పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి
మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, మార్చి 16(ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. బుధవారం పోలీస్‌ సమావేశ మందిరంలో పోలీస్‌ అధికారులు, సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, ప్రాపర్టీ, చీటింగ్‌, గంజాయి, తదితర కేసులపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరస్థులను పట్టుకోవాలి. కళాశాలల పరిధిలో విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. గంజాయి, సారా, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి. ఒడిశా నుంచి ఎక్కువగా గంజాయి దిగుమతి అవుతుంది. సమన్వయం చేసుకుంటూ గంజాయి రవాణా అరికట్టాలి. నేరాలు జరగకుండా పటిష్ఠ నిఘా పెట్టాలి. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ప్రతి కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరచాలి. హెల్మెట్‌ ధారణపై వాహనదారులకు అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రతా నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలి. ఈసీవోపీఎస్‌ పై అందరూ దృష్టి పెట్టాలి. అల్టర్నేషన్‌ రిపోర్ట్‌లు సరిగా ఉన్నాయో.. లేవో చూసుకోవాలి. సీసీ కెమెరాల్లో అనుమానితులుగా కనిపించే వారి వివరాలు సేకరించాలి.’ అని తెలిపారు. ఈ సమీక్షలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:10 PM