Share News

palle panduga works పల్లె పండుగ పనులపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:52 PM

Special Focus on palle panduga works జిల్లాలో ‘పల్లె పండుగ’ కింద చేపడుతున్న నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ మండల అధికారులను ఆదే శించారు.

 palle panduga works   పల్లె పండుగ పనులపై ప్రత్యేక దృష్టి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘పల్లె పండుగ’ కింద చేపడుతున్న నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ మండల అధికారులను ఆదే శించారు. పల్లె పండుగ పనులపై రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కలెక్టర్లు, డ్వామా పీడీలతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాణాల పురోగతి, నిధులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మండల అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ.. పల్లె పండుగ కింద జిల్లాలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. వీలైనన్ని ఎక్కువ ఫారంపాండ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మినీ గోకులాలు, ప్రహరీలు, రహదారుల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీవో టి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:52 PM