Share News

Mental Health మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:33 PM

Special Focus on Mental Health ‘ రోగుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటువంటి వారిని సకాలంలో గుర్తించి తగు చికిత్స, పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.’ అని పీఆర్‌సీ(పాపులేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌)బృంద సభ్యులు తెలిపారు. జిల్లాలో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ మేరకు గురువారం సీతంపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.

  Mental Health మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సీతంపేట ఏరియా ఆసుపత్రిలో విభాగాలను పరిశీలిస్తున్న పీఆర్‌సీ బృందం

సీతంపేట రూరల్‌/ కురుపాం, డిసెంబరు18(ఆంధ్రజ్యోతి): ‘ రోగుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటువంటి వారిని సకాలంలో గుర్తించి తగు చికిత్స, పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.’ అని పీఆర్‌సీ(పాపులేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌)బృంద సభ్యులు తెలిపారు. జిల్లాలో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ మేరకు గురువారం సీతంపేట ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. తొలుత బృంద సభ్యులు వై.రమణ, సీపీ పాదాలు, జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి జగన్మోహనరావు తదితరులు సూపరింటెండెంట్‌, ప్రత్యేక వైద్యాధికారులతో సమీక్షించారు. మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది పనితీరును అడిగి తెలుసు కున్నారు. ఏరియా ఆసుపత్రిలో రికార్డులు, పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి అక్కడ విద్యార్థినులతో ముచ్చటించారు. మానసిక ఆరోగ్య కార్యక్రమాలపై సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారా?లేదా?అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం సందర్శించి.. అక్కడి సిబ్బందితో సమీక్షించారు. ఈ పరిశీలనలో సీతంపేట, కురుపాం ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, సునీల్‌కుమార్‌, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్‌ కృష్ణారావు, ఎన్‌సీడి సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:33 PM