లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:11 AM
భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు పార్వతీపురంఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తెలిపారు. సోమవారం పార్వతీపురంలోని సౌందర్య థియే టర్‌వీధి, గణేష్‌నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటిం చారు.
పార్వతీపురంటౌన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు పార్వతీపురంఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర తెలిపారు. సోమవారం పార్వతీపురంలోని సౌందర్య థియే టర్‌వీధి, గణేష్‌నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటిం చారు.ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఏటా పట్టణం లోని వరహలగెడ్డ పరివాహకంలోగల కాలనీలు ముంపునకు గుర వుతున్నాయని తెలిపారు. ప్రధాన రహదారిలో వరద నీరు నిల్వ ఉండకుండా కాలువల్లో పూడికలు తీయించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామన్నారు. కాగా పార్వతీపురంలోని బైపాస్, రాయగడ రోడ్డు, పాతబస్టాండ్ రహదారులను ఎమ్మెల్యే విజయచంద్ర, ఆర్ అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ రహదారుల్లో భారీ గుంతలు ఏర్పడడంతో వాహనాలు నిలిచిపోవడం వల్ల ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు.