Special Focus ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:29 PM
Special Focus on Every Student గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం పి.కోనవలస , పద్మాపురం, పాచిపెంట, బద్నక్‌వలసలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర, బాలికల పాఠశాల మినీ గురుకులాన్ని సందర్శించారు.
పాచిపెంట, డిసెంబరు18(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం పి.కోనవలస , పద్మాపురం, పాచిపెంట, బద్నక్‌వలసలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర, బాలికల పాఠశాల మినీ గురుకులాన్ని సందర్శించారు. ముందుగా ఆయా ఆయా పాఠశాలల విద్యార్థులతో ముచ్చ టించారు. బోధన గదులు, పరిసరాలు, మరుగుదొడ్లు, తాగునీరు, డార్మెటరీ, తదితర మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరీక్షించారు. పాఠశాలల్లోని వస తులు, భోజన నాణ్యత, విద్యా బోధనపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన విద్య, పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి అలసత్వం వహించరాదని ఉపాధ్యాయులు, వార్డెన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు వారికి వైద్య పరీక్షలు చేయించాలన్నారు. ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత కావాలని, చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.