10th Class Students టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:23 AM
Special Focus on 10th Class Students గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి.. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. బుధవారం భామినిలో గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
భామిని, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి.. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. బుధవారం భామినిలో గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. సబ్జెక్టులపై సందేహాలను నివృత్ది చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. క్రమం తప్పకుండా చదివి ఎక్కడ మార్కులు సాధించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పి.శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆసుపత్రి పనులు వేగవంతం
సీతంపేట రూరల్: సీతంపేట ఏరియా ఆసుపత్రితో పాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆసుపత్రి పనులను పరిశీలించారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించ కూడదన్నారు. నిర్మాణం పూర్తయితే రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుతాయని తెలిపారు. ఈ పరిశీలనలో ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు, ఏపీఎంఐడీసీ అధికారులు ఉన్నారు.