Children's Health చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:19 AM
Special Care for Children's Health చిన్నారుల మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. శనివారం బాలల సత్వర చికిత్స కేంద్రంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
పార్వతీపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తెలిపారు. శనివారం బాలల సత్వర చికిత్స కేంద్రంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 ఏళ్లలోపు బాలలకు విశాఖ మెడీకవర్ ఆసుపత్రి వైద్య నిపుణుడు ఎ.అశోక్‌రాజు ఆధ్వర్యంలో 2డీ, ఈకో తదితర పరీక్షలు చేశారు. అనంతరం డీఎంహెచ్‌వో అక్కడి వారి వైద్య పరీక్షల వివరాలు, ఆరోగ్య స్థితిగతులను ప్రత్యేక వైద్యుడిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 26 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి శస్త్ర చికిత్సలు, ముగ్గురికి కార్డియాక్ ఇంటర్వెన్షన్ నిమిత్తం మెడీకవర్‌కు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్యసేవా పథకం ద్వారా చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి టి.జగన్మోహన్‌రావు, డీపీఎంవో రఘుకుమార్, డీఈఐసీ పిల్లల వైద్య నిపుణుడు భరత్‌చంద్ర, డాక్టర్ కౌశిక్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.