Share News

క్షణికావేశంతో కొడుకు దాడి

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:55 PM

ఎంఆర్‌ అగ్రహారంలో గురువారం విషాదం చోటుచేసుకుంది.

క్షణికావేశంతో కొడుకు దాడి

తెర్లాం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎంఆర్‌ అగ్రహారంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ కొడుకు తన తండ్రిని రాయితో కొట్టి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరపు అప్పలస్వామి(75)కి ఇద్దరు కూమారులు ఉన్నారు. పెద్ద కూమారుడు సత్యం వ్యవసాయం చేస్తుంటాడు. రెండో కూమారుడు శంకరారావుకు వివాహమైంది. అయితే భార్యతో కలిసి ఉండటంలేదు. కొన్నాళ్లుగా అన్నయ్యతో కలిసి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా తన తండ్రి తనను సక్రమంగా చూడక పోవడమే కాకుండా తనపై ఎందుకు ఊరంతా చెడుగా చెబుతున్నారని శంకరరావు బుధవారం తన తండ్రిని ప్రశ్నించాడు. దాంతో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో శంకరరావు తన తండ్రిపై రాయిని విసిరికొట్టాడు. అది తండ్రి తలకు బలంగా తగిలింది. దాంతో అధికంగా రక్తస్రావమైంది. విషయం గమనించిన అప్పలస్వామి మనువరాలు కల్పన.. తెర్లాంలో ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమించడంతో గురువారం అప్పలస్వామి మృతిచెందాడు. మనువరాలు కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నారాయణరావు, ఎస్‌ఐ సాగర్‌బాబు రంగంలోకి దిగి క్యూస్‌ టీంతో ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై సీఐ కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 18 , 2025 | 11:55 PM