Share News

చేపలవేటకు వెళ్లి ఒకరి గల్లంతు

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:53 PM

మండలంలోని ఎన్‌.ములగ గ్రామానికి చెందిన పాడి బంగారిదొర(45) చేపలవేటకు వెళ్లి శనివారం గల్లంత య్యారు.

చేపలవేటకు వెళ్లి ఒకరి గల్లంతు

పార్వతీపురం రూరల్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎన్‌.ములగ గ్రామానికి చెందిన పాడి బంగారిదొర(45) చేపలవేటకు వెళ్లి శనివారం గల్లంత య్యారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వెలగవలస గ్రామ సమీపంలో ఉన్న చెరువులో చేపలవేటకు నలుగురు వెళ్లారు. వీరిలో బంగారి దొర గల్లంత య్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ సంతోషి సిబ్బందితో కలిసి చెరువు వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి 7.45 గంటల నిమిషాల వరకు మృతదేహం లభ్యం కాలేదు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు మడక విశ్వనాధం గ్రామ పెద్దలు భీమవరపు సూర్యనారాయణ తదితరులు పోలీసులకు సహకరిస్తున్నారు.

Updated Date - Aug 30 , 2025 | 11:53 PM