Share News

తోటపల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:03 AM

తోటప ల్లి ప్రాజెక్ట్‌ నిర్వాసితుల సమస్యలను పరిష్క రించాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

తోటపల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించండి
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న నిర్వాసితులు

బెలగాం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): తోటప ల్లి ప్రాజెక్ట్‌ నిర్వాసితుల సమస్యలను పరిష్క రించాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు గురువారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆ సంఘం నాయకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ తోటపల్లి నిర్వాసితు ల పెండింగ్‌ సమస్యలు గత వైసీపీ ప్రభుత్వం పరిష్కరించలేదని, నిర్లక్ష్యం చేసిందని ఆరోపిం చారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి, నిర్వాసితులను ఆదుకోవాలని ఆయన కోరారు. 1500 మందికి ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించలే దని, కొన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించలేదని అన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు బంటు దాసు, జియ్యమ్మవలస, బిత్తర పాడు తదితర నిర్వాసిత గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:03 AM