సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:46 PM
కార్మికులకు సంబంధించి దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని ఎన్‌ఎంయూ పార్వతీపురం డిపో కార్యదర్శి కేబీరాజు, ఉపాధ్యక్షుడు బోగేష్‌లు డిమాండ్‌చేశారు.
పార్వతీపురంటౌన్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు సంబంధించి దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని ఎన్‌ఎంయూ పార్వతీపురం డిపో కార్యదర్శి కేబీరాజు, ఉపాధ్యక్షుడు బోగేష్‌లు డిమాండ్‌చేశారు. గురువారం పార్వతీపురంలోని ఆర్టీసీడిపో గేటు వద్ద కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరి ష్కరించాలని నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల హక్కులను పరిరక్షించాల్సిన యాజమాన్యంవారిపై నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. డ్రైవర్లు, సిబ్బందికి ప్రభుత్వం నుం చి రావాల్సిన రాయితీలతోపాటుసదుపాయాలను యాజమాన్యం నిలుపు దల చేయడం సరైన పద్ధతికాదని తెలిపారు. ఎలక్ర్టికల్ బస్సులు ప్రభుత్వం, సంస్థ ద్వారా నడపాలని కోరారు. మహిళా కండకర్లకు విధి నిర్వహణలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలని డిమాండ్‌చేశారు.