Share News

విద్యుత్‌ స్తంభాల సమస్య పరిష్కరించండి

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:10 AM

విజయనగరంలోని గాంధీ నగర్‌, మజ్జిపేట, ప్రదీప్‌నగర్‌ ప్రాంతాల్లో 9 విద్యుత్‌ స్తంభాలు రోడ్డు మధ్యలో ఉన్నాయని.. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ ప్రాంతానికి చెందిన టీడీ పీ నాయకురాలు బమ్మిడి ప్రమీల... ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దృష్టికి తీసుకువచ్చారు.

విద్యుత్‌ స్తంభాల సమస్య పరిష్కరించండి
ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు సమస్యలను వివరిస్తున్న ప్రజలు

విజయనగరం రూరల్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని గాంధీ నగర్‌, మజ్జిపేట, ప్రదీప్‌నగర్‌ ప్రాంతాల్లో 9 విద్యుత్‌ స్తంభాలు రోడ్డు మధ్యలో ఉన్నాయని.. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ ప్రాంతానికి చెందిన టీడీ పీ నాయకురాలు బమ్మిడి ప్రమీల... ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దృష్టికి తీసుకువచ్చారు. తన కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుక్రవారం ప్రజాదర్భార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక పింఛన్లు, ఇళ్లు, ఇంటి రుణాలు మంజూరు చేయాలని కోరుతూ పలువురు వినతులు ఇచ్చారు. కొత్తపేట, యాదవవీధి, లంకాపట్టణం, రైల్వే స్టేషన్‌ ఏరియా తదితర ప్రాంతాల నుంచి ప్రజలు స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. దీనిలో తమ దృష్టికి వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. వాటిని వివిధ శాఖలకు పంపించి... పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వివరించారు.

Updated Date - Aug 09 , 2025 | 12:10 AM