సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:15 AM
పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆ సంఘ మండలా ధ్యక్షుడు పార్థసారధి కోరా రు.ఈ మేరకు ఎంపీడీవో రత్నంకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

రామభద్రపురం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆ సంఘ మండలా ధ్యక్షుడు పార్థసారధి కోరా రు.ఈ మేరకు ఎంపీడీవో రత్నంకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ పనిభారం వల్ల కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వివిధ రకాల సర్వేల వల్ల సెలవు , పండగ దినాల్లో కూడా పనిచేయడంతో పలువురు అ నారోగ్యానికి గురవుతున్నారన్నారు. జాబ్‌చా ర్టులో లేని పనులు కూడా చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మిస్సింగ్ సిటిజన్ సర్వే, మిస్సింగ్ ఎంప్లాయి సర్వే, వర్క్‌ఫ్రంహోం,సర్వే, హౌస్‌హోల్డ్ జియో ట్యాగింగ్ సర్వే, పి-4 సర్వే, డెత్ రీవెరిఫికేషన్ సర్వే, పీఏసీఎస్ సర్వే, లేథర్ హార్టిసియన్స్ సర్వే, ఎంపీసీఐ లింకింగ్ సర్వే, ఆరేళ్లలోపు పిల్లల మిస్సింగ్ ఆధార్ సర్వే, నాన్ ఏపీ రెసి డెన్షియల్ సర్వే, విలేజ్ ఎసర్ట్స్ సర్వే, విలేజ్ ప్రొఫైల్ సర్వేతో పనిభారం పెరిగిందని తెలి పారు.వీటితోపాటు మరో29 బాధ్యతలు కార్య దర్శు లకు అప్పగించడం ఎంతవరకు సమం జసమని ప్రశ్నించారు. ఇంటి,కొళాయి పన్ను లు, లైసెన్స్‌ల వసూళ్లు కూడా తమతో చేయిం చడం, సచివాలయసిబ్బంది, రాజ కీయ నాయకులతో సమన్వయం తదితర తమ శాఖకు సంబంధంలేని పనులుఅప్పగించడం ఇబ్బంది కలుగుతోందని వాపోయారు. కార్యక్రమం లో పంచా యతీ కార్యదర్శుల సంఘం నాయ కులు బొద్దూరు శ్రీనివాసరావు, శ్రావణ్‌కు మార్, ఆకుల ప్రవీణ్‌కుమార్, బాలకృష్ణ, పొట్టా బంగార్రాజు, ఎ. శ్రీనివాసరావు, అడపా ఈశ్వరరావు, బాలకృష్ణ పాల్గొన్నారు.