చంద్రబాబుతోనే సామాజిక న్యాయం
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:18 AM
: సీఎం నారాచంద్రబాబు నాయుడుతోనే సామాజిక న్యాయం సాధ్యమని ఏపీ మార్కెఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు తెలిపారు

భోగాపురం, మార్చి15(ఆంధ్ర జ్యోతి): సీఎం నారాచంద్రబాబు నాయుడుతోనే సామాజిక న్యాయం సాధ్యమని ఏపీ మార్కెఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు తెలిపారు. శనివారం మండలంలోని పోలిపల్లిలో చంద్రబాబునాయుడు శాసనసభలో తొలిసారి ప్రమాణం స్వీకారం చేసి 47 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం గా విలేకరులతో మాట్లాడారు. తొలిసారిగా చంద్రబాబు ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి నేటితో 47 ఏళ్లు పూర్తయ్యిందని తెలిపారు. సైబరాబాద్, అమరావతి, పోలవరం సృష్టికర్త, అభివృద్ధి ప్రదాత చంద్రబాబే అన్నారు. చంద్రబాబు తనకున్న విజన్‌తో తెలుగు రాష్ట్రాను అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో నాయకులు అప్పలస్వామి, కందిరమణ, ఎ.శ్రీను పాల్గొన్నారు.