Share News

who’s coming along? వెళ్తున్నారు సరే.. వచ్చేవారేరీ?

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:06 AM

So you’re going… but who’s coming along? జిల్లాను అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. బదిలీలపై కొందరు.. సెలవు పెట్టి మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మరోవైపు కీలక శాఖల్లో పోస్టులు భర్తీ కావడం లేదు. ఇతర జిల్లాల నుంచి బదిలీలపై ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ నచ్చడం లేదు.

 who’s coming along? వెళ్తున్నారు సరే.. వచ్చేవారేరీ?

  • బదిలీలపై కొందరు.. జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చి సెలవు పెట్టి మరికొందరు..

  • వేరే ప్రాంతాలకు తరలిపోతున్న అధికారులు

  • కీలక పోస్టులన్నీ ఖాళీ

పార్వతీపురం, జూన్‌24(ఆంధ్రజ్యోతి): జిల్లాను అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. బదిలీలపై కొందరు.. సెలవు పెట్టి మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మరోవైపు కీలక శాఖల్లో పోస్టులు భర్తీ కావడం లేదు. ఇతర జిల్లాల నుంచి బదిలీలపై ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ నచ్చడం లేదు. వివిధ కారణణలతో ఈ జిల్లాకు రాకముందే వేరే ప్రాంతానికి వెళ్లి పోయేందుకు పైరవీలు చేసుకుటున్నారు. మరి కొంతమంది విధుల్లో చేరి.. సెలవుపై వెళ్లి పోతున్నారు. జిల్లాకు బదిలీ అయిన కొందరు అధికారులు విధుల్లో చేరకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో జిల్లావాసులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

ఇదీ పరిస్థితి..

- జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్యామల బదిలీపై వెళ్లిపోగా.. ఆమె స్థానంలో సత్యనారాయణరెడ్డి నియామకమయ్యారు. అయితే ఆయన విధుల్లో చేరిన వెంటనే సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీనివల్ల ఉద్యాన శాఖకు జిల్లా అధికారి లేని పరిస్థితి ఏర్పడింది.

- డీపీవోగా రవీంద్ర నియామకయ్యారు. ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్న కొండలరావుకు బదిలీ అయినప్పటకీ ఆయన స్థానంలో రవీంద్ర కూడా విధుల్లో చేరలేదు.

- మత్స్యశాఖకు కూడా జిల్లా అధికారి లేరు.

- వివిధ శాఖలకు క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కూడా లేరు.

- పార్వతీపురం మన్యం మారుమూల జిల్లాగా కొంతమంది అధికారులు భావిస్తున్నారు. దీంతో బదిలీపై జిల్లాకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. వారు విధుల్లో చేరకుండా మైదాన ప్రాంత జిల్లాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

వైద్య శాఖలో ఇలా..

వైద్య ఆరోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగులకు స్థానచలనమైనా ఆ ప్రాంతానికి వెళ్లలేకపోతున్నారు. ఎందుకంటే వారి స్థానంలో ఇతర జిల్లాల నుంచి ఉద్యోగులు రావడం లేదు. మైదాన ప్రాంతాలకే ఆ ఉద్యోగులు పరిమితమవుతున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏళ్లుగా అక్కడే పనిచేయాల్సి వస్తోంది. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:06 AM