స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:21 AM
విద్యుత్ స్మార్ట్‌మీటర్లను రద్దు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. మంగళవారం పార్వతీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
పార్వతీపురంటౌన్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): విద్యుత్ స్మార్ట్‌మీటర్లను రద్దు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. మంగళవారం పార్వతీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఏడాదిలో రూ.30 వేల కోట్లు విద్యుత్ భారం, అదానీ స్మార్ట్ మీటర్లతో ప్రజలను శాశ్వత దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. విద్యుత్ భారాలపై ప్రజలు తీవ్రవ్యతిరేకతతో ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూటమి నాయకులు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి ఉండగా ఉంటామని గతంలో పేర్కొన్నారని, ఇప్పుడు కనీసం స్పందించడం లేదని ఆరోపించారు.
ఫగుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లేవిడి సబ్‌స్టేషన్ ఆవ రణలో సీపీఎం ఆధ్వర్యంలో స్మార్ట్‌మీటర్లు రద్దు చేయాలని మంగళవారం నిరసన తెలి పారు. అనంతరం సిబ్బందికి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రజలకు హామీఇచ్చిన కూటమి పెద్దలు ఇప్పుడు పెంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు గౌరీశ్వరరావు, పువ్వుల తిరుపతిరావు, ఎం.సన్యాసిరావు, ఎం.వెంకటకరావు పాల్గొన్నారు.