పొలం గట్టుపై నుంచి జారిపడి..
ABN , Publish Date - May 02 , 2025 | 12:21 AM
మద్యం మత్తులో పొలం గట్టుపై నుంచి జారిపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తి మృతి చెందిన ఘటన కొత్తవలసలో చోటు చేసుకుంది.
కొత్తవలస, మే 1 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో పొలం గట్టుపై నుంచి జారిపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తి మృతి చెందిన ఘటన కొత్తవలసలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కొత్తవలస సీఐ షణ్ముఖరావు అందించిన వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం పెదనందిపల్లి గ్రామానికి పల్లా గంగునాయుడు (48) ఇంటి వద్ద ఒక్కడే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. గతనెల 27న మండలంలోని సంతపాలెంలో నివాసం ఉంటున్న తన తమ్ముడు ఇంటికి వచ్చాడు. రెండురోజుల పాటు ఉన్న గంగునాయుడు మేకల మందను కాసే పని వెతుక్కుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మేకల మంద కాసే పనికోసం వెళ్లిన గంగునాయుడు పూటుగా మద్యం సేవించి మండలంలోని గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన పొలం గట్టుపై నుంచి జారి పడ్డాడు. ఎవరూ గుర్తించకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గురువారం పొలం గట్ల కింద పడి ఉండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అం దించారు. సీఐ సిబ్బందితో వెళ్లి చూసినప్పటికే మృతి చెంది ఉండడంతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించారు.