Child Prodigies అక్కాచెల్లెళ్లు.. బాల మేధావులు
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:08 PM
Sisters, Child Prodigies ఆ అక్కా చెల్లెళ్లు.. బాల మేధావులు. ఏ విషయమైనా చటుక్కున పట్టేసి.. ఠక్కున చెప్పేసే జ్ఞానం వారి సొంతం. చిన్న వయసులోనే రాజధానులు, జాతీయ, రాష్ట్ర చిహ్నాల పేర్లు చెబుతూ.. అందర్నీ అబ్బురపరుస్తున్నారు.
వారి అపార జ్ఞాపక శక్తికి అందరూ ఫిదా
జియ్యమ్మవలస, డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): ఆ అక్కా చెల్లెళ్లు.. బాల మేధావులు. ఏ విషయమైనా చటుక్కున పట్టేసి.. ఠక్కున చెప్పేసే జ్ఞానం వారి సొంతం. చిన్న వయసులోనే రాజధానులు, జాతీయ, రాష్ట్ర చిహ్నాల పేర్లు చెబుతూ.. అందర్నీ అబ్బురపరుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చినమేరంగి గ్రామానికి చెందిన శివప్రసాద్ బ్రహ్మ, ధరిత్రిలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో శ్రీనిధికి నాలుగేళ్లు. రెండో కుమార్తె శ్రీహితకు రెండున్నరేళ్లు. వారిద్దరూ దేశంలోని వివిధ రాష్ట్రాలు, వాటి రాజధానులు, జాతీయ చిహ్నాలు అనర్గళంగా చెబుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. చిన్నారుల జ్ఞాపికశక్తికి స్థానికులు సైతం ఫిదా అవుతున్నారు. మరికొందరైతే ముక్కున వేలేసు కుంటున్నారు. శివప్రసాద్ ఎలక్ర్టికల్ సామగ్రి షాపు నిర్వహిస్తుండగా.. ధరిత్రి గృహిణిగా ఉన్నారు. వారు తమ పిల్లలకు రోజూ పలు అంశాలను బోధిస్తూ.. జ్ఞాన సంపదను పెంపొం దిస్తున్నారు.