Sirimanu tree with great respect సిరిమాను చెట్టుకు ఘనంగా పూజలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:58 PM
Sirimanu tree with great respect సిరిమాను చెట్టుకు ఘనంగా పూజలు చేశారు. కొండతామరాపల్లిలో చెట్టును గుర్తించినట్లు తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల భక్తులు బుధవారం జరిగిన పూజల్లో విశేషంగా పాల్గొన్నారు.
సిరిమాను చెట్టుకు ఘనంగా పూజలు
కొండతామరాపల్లిలో భక్తుల బారులు
గంట్యాడ, సెప్టెంబరు 17(ఆంరఽధజ్యోతి): సిరిమాను చెట్టుకు ఘనంగా పూజలు చేశారు. కొండతామరాపల్లిలో చెట్టును గుర్తించినట్లు తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల భక్తులు బుధవారం జరిగిన పూజల్లో విశేషంగా పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో కీలకంగా ఉండే సిరిమాను చెట్టును కొండతామరాపల్లిలో మంగళవారం గుర్తించిన విషయం తెలిసిందే. ఆ చెట్టుకు బుధవారం వైభవంగా పూజలు చేశారు. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను చెట్టుకు బొట్టుపెట్టాక పూజ ఆరంభించారు. గ్రామానికి చెందిన చల్లా అప్పలనాయుడు, నారాయణమూర్తి, రామకృష్ణ కల్లాల్లో సిరిమాను, లోకవరపు సత్యం కల్లంలో ఇరుసుమానును గుర్తించారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య సంప్రదాయబద్ధంగా వాటికి పూజలు నిర్వహించారు. తమ గ్రామంలో సిరిమాను చెట్టును గుర్తించడం అదృష్టంగా భావిస్తున్నామని కొండతామరాపల్లి వాసులు హర్షం వ్యక్తం చేశారు. ముందుగానే గ్రామానికే పైడితల్లి పండగ వచ్చిందంటున్నారు. పూజల్లో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఆలయ సహాయ కమిషనర్ శిరీష, గంట్యాడ మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, టీడీపీ గంట్యాడ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌నాయుడు, గ్రామ పెద్దలు , మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
24న విజయనగరం రాక
విజయనగరంరూరల్/కల్చరల్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): సిరిమానోత్సవానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం అవుతోంది. సిరిమాను, ఇరుసుమా ను చెట్లను గంట్యాడ మండలం కొండతామరాపల్లిలో గుర్తించిన నేపథ్యంలో వాటిని విజయనగరం తీసుకువచ్చేందుకు పైడిమాంబ ఆలయ అర్చకులు ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 24న ఉదయం 10 గంటల సమయంలో సిరిమాను చెట్లకు పూజలు నిర్వహించి అనంతరం విజయనగరం తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం సిరిమానోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో రెండో దఫా గురువారం సమావేశం నిర్వహిస్తోంది. చర్చించాల్సిన అంశాలు, వివిధ శాఖలు చేపట్టాల్సిన బాధ్యతలు తదితర అంశాలతో ప్రణాళిక సిద్ధంచేశారు.