Share News

Ganesh Mandaps గణేష్‌ మండపాలకు సింగిల్‌ విండో సిస్టమ్‌

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:00 AM

Single-Window System for Ganesh Mandaps జిల్లాలో గణేష్‌ మండపాల ఏర్పాటుకు సింగిల్‌ విండో సిస్టమ్‌ ఏర్పాటు చేశామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. గణేష్‌ మండపాల అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

  Ganesh Mandaps గణేష్‌ మండపాలకు సింగిల్‌ విండో సిస్టమ్‌
ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గణేష్‌ మండపాల ఏర్పాటుకు సింగిల్‌ విండో సిస్టమ్‌ ఏర్పాటు చేశామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. గణేష్‌ మండపాల అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇంతకుముందు అగ్నిమాపక, పురపాలక, విద్యుత్‌, పోలీస్‌ తదితర శాఖల అనుమతలు తీసుకోవాల్సి వచ్చేందని.. ఇప్పుడా అవసరం లేదని తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులో వివరాల న్నింటినీ పొందుపరిచి అనుమతులు పొందొచ్చని వెల్లడించారు. అనంతరం చవితి ఉత్సవాల నిర్వహణకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు.

Updated Date - Aug 20 , 2025 | 12:00 AM