పాటలు పాడి.. బాణాలతో ఊరేగి..
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:03 AM
ఒంపల్లిలో ఆదర్శపాఠశాల విద్యార్థులు సం ప్రదాయాలను గుర్తుచేశారు.బుధవారం దసరాఉత్సవాల్లో భాగంగా సందడిగా దసరా పాటలుపాడి కర్రతో తయారుచేసిన బాణాలతో ఊరేగించారు.
బొండపల్లి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఒంపల్లిలో ఆదర్శపాఠశాల విద్యార్థులు సం ప్రదాయాలను గుర్తుచేశారు.బుధవారం దసరాఉత్సవాల్లో భాగంగా సందడిగా దసరా పాటలుపాడి కర్రతో తయారుచేసిన బాణాలతో ఊరేగించారు. ఈసందర్భంగా పాఠశాల హెచ్‌ఎం, ఆదివాసీఉపాధ్యాయ అసోషియేషన్ అధ్యక్షులు ఆసరి తవిటందొర మాట్లాడు తూ విద్యార్థుల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ కలిగేలా ప్రోత్సహం అందించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.