Siberian birds to Ayyakoneru అయ్యకోనేరుకు సైబీరియా పక్షులు
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:53 PM
Siberian birds to Ayyakoneru నగరంలోని అయ్యకోనేరుకు అతిథులు వచ్చాయి. సైబీరియా దేశ పక్షులు ఒక్కసారిగా దర్శనమిచ్చాయి.
అయ్యకోనేరుకు సైబీరియా పక్షులు
నగరంలోని అయ్యకోనేరుకు అతిథులు వచ్చాయి. సైబీరియా దేశ పక్షులు ఒక్కసారిగా దర్శనమిచ్చాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అయ్యకోనేరు జలకళ సంతరించుకుంది. అయితే ఐదేళ్ల నుంచి పక్షులు అతి తక్కువ సంఖ్యలో వచ్చేవి. మంగళవారం సాయంత్రం ఓ పక్షుల గుంపు వచ్చి చెరువుపై విహరించింది. అవి చేపలను వేటాడి తింటుండడం చూసిన వారంతా ఫొటోలతో క్లిక్‌మనిపించారు.
- విజయనగరం రూరల్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి)
------------------------------