SI Transfers ఎస్‌ఐల బదిలీలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:06 AM
SI Transfers జిల్లాలో ఎస్‌ఐలను బదిలీ చేస్తు సోమవారం ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మన్యం నుంచి ముగ్గురు ఎస్‌ఐలు బదిలీపై వెళ్తుండగా.. ఇతర జిల్లాల నుంచి నలుగురు ఎస్‌ఐలు ఇక్కడకు వస్తున్నారు.
పార్వతీపురం/రూరల్/ డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ): జిల్లాలో ఎస్‌ఐలను బదిలీ చేస్తు సోమవారం ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మన్యం నుంచి ముగ్గురు ఎస్‌ఐలు బదిలీపై వెళ్తుండగా.. ఇతర జిల్లాల నుంచి నలుగురు ఎస్‌ఐలు ఇక్కడకు వస్తున్నారు. సాలూరు రూరల్, పాచిపెంట ఎస్‌ఐలు పి.నర్సింహమూర్తి, కె.వెంకట సురేష్ శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. పార్వతీపురం ఒకటో పట్టణ ఎస్‌ఐ బి.సంతోషికుమారి అనకాపల్లి జిల్లాకు వెళ్లనున్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల నుంచి ఎస్‌ఐలు షణ్ముఖ, రవీంద్ర , విజయకుమారి, షేక్ సాహిబా అంజుమ్ మన్యం జిల్లాకు రానున్నారు. వారికి త్వరలోనే పోస్టింగ్ ఇవ్వనున్నారు.