Share News

SI dies of heart attack గుండెపోటుతో ఎస్‌ఐ మృతి

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:07 AM

SI dies of heart attack విజయవాడలో విజయదశమి విధులు నిర్వహించేందుకు వెళ్లిన పూసపాటిరేగ రెండో ఎస్‌ఐ శ్రీనివాసరావు తాను విశ్రాంతి తీసుకుంటున్న లాడ్జిలో సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.

SI dies of heart attack గుండెపోటుతో ఎస్‌ఐ మృతి
ఎస్‌ఐ శ్రీనివాసరావు(ఫైల్‌)

గుండెపోటుతో ఎస్‌ఐ మృతి

పూసపాటిరేగ,సెప్టెంబర్‌29(ఆంధ్రజ్యోతి): విజయవాడలో విజయదశమి విధులు నిర్వహించేందుకు వెళ్లిన పూసపాటిరేగ రెండో ఎస్‌ఐ శ్రీనివాసరావు తాను విశ్రాంతి తీసుకుంటున్న లాడ్జిలో సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. స్నానపు గదిలో ఉన్నచోటే కూలిపోయారు. ఈయన కొంతకాలంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం అనకాపల్లి. ఈయనకు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్‌ఐ మృతి వార్త తెలిసి స్థానిక ఒకటో ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌, స్టేషన్‌ సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. ఆయన మృతదేహానికి విజయవాడ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తీసుకెళ్లారని ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Sep 30 , 2025 | 12:07 AM