Share News

Scholarship ప్రతిభ చూపితే రూ. 24 వేల స్కాలర్‌ షిప్‌

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:12 PM

Show Your Talent, Win ₹24,000 Scholarship విద్యార్థి విజ్ఞాన మంథన్‌ పరీక్షలో ప్రతిభ చూపితే ఏడాదికి రూ. 24 వేల స్కాలర్‌ షిప్‌ పొందొచ్చనని జిల్లా కో ఆర్డినేటర్‌ కోట అయ్యప్ప చెప్పారు. శుక్రవారం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణకు గాను కేంద్ర సర్కారు ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు.

  Scholarship  ప్రతిభ చూపితే రూ. 24 వేల స్కాలర్‌ షిప్‌
విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ లోగో

సాలూరు రూరల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి విజ్ఞాన మంథన్‌ పరీక్షలో ప్రతిభ చూపితే ఏడాదికి రూ. 24 వేల స్కాలర్‌ షిప్‌ పొందొచ్చనని జిల్లా కో ఆర్డినేటర్‌ కోట అయ్యప్ప చెప్పారు. శుక్రవారం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణకు గాను కేంద్ర సర్కారు ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ ప్రథమ ఏడాది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ రుసుం రూ. 200 చెల్లించి, వచ్చే నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌తో పాటు ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌, స్కాలర్‌ షిప్‌ పొందే అవకాశముంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 99484 42298 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Updated Date - Aug 29 , 2025 | 11:12 PM