కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా గుర్తించాలి
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:18 AM
తమను కాంట్రాక్ట్ ఫ్యాక్టలీగా గుర్తించాలని రాజీవ్‌గాంఽధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ రెడ్డి లక్ష్ముంనాయుడు, వై. నారాయణరావు, పి.నవీన్ కోరారు.
ఎచ్చెర్ల, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : తమను కాంట్రాక్ట్ ఫ్యాక్టలీగా గుర్తించాలని రాజీవ్‌గాంఽధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ రెడ్డి లక్ష్ముంనాయుడు, వై. నారాయణరావు, పి.నవీన్ కోరారు. ఈ మేరకు ట్రిబుల్ ఐటీ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీకి గురువారం వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో రాత పరీక్ష ఇంటర్వ్యూ, కాంట్రాక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన గెస్ట్ ఫ్యాకల్టీకి రిజగ్నేషన్ ఇచ్చి తీరని అన్యాయం చేశారని తెలిపారు. 2018 సంవత్సరం తరువాత గెస్ట్ ఫ్యాకల్టీగా చేరిన వారందరికీ రూ.40 వేల వరకూ వేతనాలు పెంచి తమకు రూ.25 వేలకే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు దఫాలు సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసికెళ్లినా న్యాయం జరగలేదని వాపోయారు.