Share News

Patients రోగులకు అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:14 PM

Should Be Accessible to Patients వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి సూచించారు. మంగళవారం గరుగుబిల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సీజన్‌లో డయేరియా, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  Patients రోగులకు అందుబాటులో ఉండాలి
గరుగుబిల్లి పీహెచ్‌సీలో వైద్యుల నుంచి సమాచారం సేకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ వైశాలి

గరుగుబిల్లి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి సూచించారు. మంగళవారం గరుగుబిల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సీజన్‌లో డయేరియా, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి గ్రామస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించాలని డాక్టర్‌ తిరుమలప్రసాద్‌కు సూచించారు. కేంద్రాల పరిధిలో సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీహెచ్‌సీల పరిధిలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం కేంద్రం పరిధిలో రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆతర్వాత రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. పీహెచ్‌సీలో పూర్తిస్థాయిలో మందులు, వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, ఉండాలన్నారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించి కొంతమేర మరమ్మతులు చేపట్టాల్సి ఉందని వైద్యులు సబ్‌కలెక్టర్‌కు వివరించారు. అనంతరం ఆమె తహసీల్దార్‌ కార్యాలయం, పెద్దూరులోని రేషన్‌ డిపో, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు.

Updated Date - Sep 02 , 2025 | 11:14 PM