Share News

Shambho Shiva Shambho శంభో శివ శంభో

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:59 AM

Shambho Shiva Shambho కార్తీకమాసం మూడో సోమవారం పురస్కరించుకుని భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. పంచాక్షరీ నామాన్ని జపిస్తూ శివుడికి అభిషేకాలు చేశారు. ఉపవాసాలతో దీపారాధనలు చేశారు.

 Shambho Shiva Shambho  శంభో శివ శంభో
సీతంపేటలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

  • ప్రాంగణాల్లో కార్తీక దీపారాధనలు

సీతంపేట రూరల్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం మూడో సోమవారం పురస్కరించుకుని భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. పంచాక్షరీ నామాన్ని జపిస్తూ శివుడికి అభిషేకాలు చేశారు. ఉపవాసాలతో దీపారాధనలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలు బారులుతీరాయి. శివనామస్మరణతో మార్మోగాయి. నదులు, చెరువులు, కోనేరుల్లో దీపాలు వెలిగించి శివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన సంఘటన నేపద్యంలో రద్దీగా ఉన్న ఆలయాల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. సీతంపేట ఏజెన్సీలో భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీరామగిరి క్షేత్రం, ముక్కుడిపోలమ్మ ఆలయ సమీపంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతంపేట, కొత్తూరు, మెట్టూరు, పులిపుట్టి, మాసింగి గ్రామాల నుండి పెద్దఎత్తున మహిళా భక్తులు తరలివచ్చారు.

Updated Date - Nov 11 , 2025 | 12:59 AM