జనవరిలో శంబర జాతర
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:56 PM
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ జాతర వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది.
మక్కువ రూరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ జాతర వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. జనవరి 26 నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ అధికారులు, ధర్మకర్తలి మండలి సభ్యులు, గ్రామపెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమావేశమై తేదీలను ఖరారు చేశారు. 26న తొలేళ్లు, 27న సిరిమానోత్సవం, 28న అనుపోత్సవం నిర్వహించనున్నారు. దీనికి ముందు నిర్వహించే పెద్దమ్మవారి ఉత్సవాల తేదీలను కూడా ప్రకటించారు. వచ్చే నెల(డిసెంబరు) 22న పెద్దమ్మవారిని గ్రామంలోకి తెచ్చేందుకు చాటింపు వేస్తారు. 29న పెద్దమ్మవారిని గ్రామంలోకి తీసుకువస్తారు. వచ్చేఏడాది జనవరి 5 తొలేళ్లు, 6న ప్రధానోత్సవం, 7న అనుపోత్సవం జరగనుంది. అదేరోజున చిన్నమ్మవారు(శంబరపోలమ్మ) జాతరకు చాటింపువేస్తారు. 12న చిన్నమ్మను గ్రామంలోకి ఆహ్వానించి చదురుగుడిలో గద్దెదించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.