Share News

SGT Counselling ఎస్జీటీల కౌన్సెలింగ్‌ నేటికి వాయిదా

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:06 AM

SGT Counselling Postponed to Today ఉపాధ్యాయుల బదిలీల్లో చివరి అంకమైన ఎస్జీటీల కౌన్సెలింగ్‌ బుధవారానికి వాయిదా పడింది. మాన్యూవల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సోమవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను పార్వతీపురంలో ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అనంతరం టీడీజీ ఎమ్మెల్సీల వినతితో ఎస్జీటీలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ కాకుండా మాన్యూవల్‌గా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు మంగళవారం జడ్పీ కార్యాలయం వద్ద కౌన్సెలింగ్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

SGT Counselling   ఎస్జీటీల కౌన్సెలింగ్‌ నేటికి వాయిదా
విజయనగరం జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద కౌన్సెలింగ్‌ కోసం వేచి ఉన్న ఉపాధ్యాయులు

రాత్రి వరకు వేచి ఉన్న ఉపాధ్యాయులు

సాలూరు రూరల్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి ): ఉపాధ్యాయుల బదిలీల్లో చివరి అంకమైన ఎస్జీటీల కౌన్సెలింగ్‌ బుధవారానికి వాయిదా పడింది. మాన్యూవల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సోమవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను పార్వతీపురంలో ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అనంతరం టీడీజీ ఎమ్మెల్సీల వినతితో ఎస్జీటీలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ కాకుండా మాన్యూవల్‌గా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు మంగళవారం జడ్పీ కార్యాలయం వద్ద కౌన్సెలింగ్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బదిలీలకు 2,200 మంది ఎస్జీటీలు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1748 మంది తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. కాగా మాన్యూవల్‌ కౌన్సెలింగ్‌కు ఒకటి నుంచి 400 నెంబర్ల వరకు ఎస్జీటీలు మధ్యాహ్నం రెండు గంటలకు విజయనగరం జడ్పీ కార్యాలయం వద్దకు హాజరయ్యారు. సాంకేతిక లోపాల వల్ల తొలుత 201 నుంచి 400 నెంబర్ల వరకు ఉపాధ్యా యులకు కౌన్సెలింగ్‌ వాయిదా వేశారు. మిగిలిన 1 నుంచి 200 నెంబర్ల వరకు ఉన్న ఉపాధ్యాయులు రాత్రి 8 గంటల వరకు వేచి ఉన్నారు. చివరకు సాంకేతిక సమస్యల వల్ల వారికి సైతం కౌన్సెలింగ్‌ వాయిదా వేసినట్టు ప్రకటించారు. దీంతో వారంతా తరలిపోయారు. ఎస్జీటీలకు కౌన్సెలింగ్‌ ఈ నెల 11న ప్రారంభం కానుంది.

Updated Date - Jun 11 , 2025 | 12:06 AM