ఉత్సాహంగా ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:15 AM
జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ 33వ జిల్లా మహాసభలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.
విజయనగరం దాసన్నపేట, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ 33వ జిల్లా మహాసభలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వేలాది మంది విద్యార్థులతో గురజాడ కళాభారతి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాము అధ్యక్షతన జరిగిన మహాసభలలో ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ మాట్లాడుతూ దేశ ంలో విద్యపైన సాముహిక దాడి జరుగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రవేశపెట్టి చాలా మంది పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ వస్తున్నదన్నారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో సరైన సౌకర్యాలు లేక ఎనిమిది మంది విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు వెంకటేష్, చినబాబు, రవి కుమార్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.