Share News

మురుగు నీరు మళ్లింపునకు కార్యాచరణ

ABN , Publish Date - Aug 20 , 2025 | 11:53 PM

పార్వతీపురంలో వరదతో పాటు మురుగునీరు మళ్లింపునకు కార్యాచరణ రూపొందించనున్నట్లు పార్వ తీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.

  మురుగు నీరు మళ్లింపునకు కార్యాచరణ
కాలువ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న విజయచంద్ర :

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో వరదతో పాటు మురుగునీరు మళ్లింపునకు కార్యాచరణ రూపొందించనున్నట్లు పార్వ తీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.బుధవారం పార్వతీపు రంలోని బైపాస్‌ రహదారిలోని సాయిబాబా ఆలయం వద్ద కాలువ నిర్మా ణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్వతీపురం మునిసిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమని తెలిపారు. వరహల గెడ్డ వరద ఉధృతిని పరిశీలించి, లోతట్టు ప్రాంతాల నివాసితులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రీని వాసరాజు, ఏఈ అప్పారావులను కోరారు.

Updated Date - Aug 20 , 2025 | 11:53 PM