నగరపాలక సంస్థకు ఏడో ర్యాంకు
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:04 AM
విజయనగరం నగరపాలక సంస్థకు ఏడో ర్యాంకును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విజయనగరం నగరపాలక సంస్థకు ఏడో ర్యాంకును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 మునిసిపాలిటీలకు పది అంశాల ఆధారంగా ప్రభుత్వం రేటింగ్ ఇచ్చింది. మొత్తం 100 మార్కులకు గానూ, 61 శాతం రేటింగ్‌తో విజయనగరం నగరపాలక సంస్థ ఏడో ర్యాంకు సాధించింది. గార్బేజ్, వీధి దీపాల నిర్వహణ, నీటినిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, ఆదాయం, రెవెన్యూ స్కోరును పరిగణనలోకి తీసుకున్నారు. ఉత్తరాంధ్రలోనే ఏడో ర్యాంకు సాధించడంపై నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య ఆనందం వ్యక్తం చేశారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. తమపై మరింత బాధ్యత పెరిగిందని, వచ్చేఏడాది తొలి ర్యాంకు సాధించేలా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, వీధి దీపాలు, ఇంటి నుంచి చెత్తసేకరణ, ఆదాయం పెరగడానికి మరింత కృషి చేస్తామని తెలిపారు.