గడ్డి మందు తిని ఏడు మేకలు మృతి
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:22 AM
మక్కువ మండలంలోని డి.శిర్లాం సమీపంలోని పొలాల్లో సోమవారం గడ్డి మందు తిని 7 మేకలు మృతి చెందాయి.
150 మేకలు, గొర్రెలకు అస్వస్థత
మక్కువ రూరల్, జూలై21 (ఆంధ్రజ్యోతి): మక్కువ మండలంలోని డి.శిర్లాం సమీపంలోని పొలాల్లో సోమవారం గడ్డి మందు తిని 7 మేకలు మృతి చెందాయి. మరో 150 మేకలు, గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. గ్రామంలోని కాపారులు ఎప్పటి మాదిరిగానే 200 మేకలు, గొర్రెలను సోమవారం ఉదయం మేత కోసం డి.శిర్లాం, గోపాలపురం గ్రామాల మధ్యలో ఆయిల్‌పామ్ తోటలో విడిచిపెట్టారు. అప్పటికే ఆ తోటల్లో కలుపు మొక్కలు, గడ్డిని తొలగించేందుకు గడ్డిమందును సంబంధిత రైతులు చల్లారు. ఆ విషయాన్ని గొర్రెల కాపరులు గమనించలేదు. దాం తో ఆక్కడే మేస్తున్న మేకలు, గొర్రెలు అస్వస్థతకు గురై కిందపడిపోయా యి. దీంతో భయాందోళన చెందిన కాపరులు గ్రామస్థులుకు విషయం తెలిపారు. వారు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అప్పటికే 7 మేక లు, గొర్రెలు మృతి చెందాయి. 150 జీవులు అస్వస్థతకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న పశువైద్య సిబ్బంది మేకలు, గొర్రెలకు ప్రాఽథమిక చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు.