Share News

Settlement రాజీతో కేసుల పరిష్కారం

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:56 PM

Settlement of Cases through Compromise రాజీ మార్గంతో కేసులను సత్వరంగా పరిష్కరించుకోవచ్చని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి దామోదరరావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 460 కేసులు రాజీ అయినట్లు ఆయన వెల్లడించారు.

Settlement  రాజీతో కేసుల పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న న్యాయాధికారి దామోదరరావు

బెలగాం, సెప్టెంబరు13(ఆంధ్రజ్యోతి): రాజీ మార్గంతో కేసులను సత్వరంగా పరిష్కరించుకోవచ్చని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి దామోదరరావు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 460 కేసులు రాజీ అయినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో సివిల్‌ 27, క్రిమినల్‌ 431, యాక్సిడెంట్‌ కేసులు 7 వరకు ఉన్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించు కోవడానికి లోక్‌ అదాలత్‌ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాజీ మార్గంతో కక్షిదారులు సమయం, డబ్బును ఆదా చేసుకోవచ్చని తెలిపారు. కోర్టుకు ఎటువంటి రుసుము చెల్లించకుండా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ర్టేట్‌ సౌమ్యజాస్పిన్‌, ఏపీపీ ఎ.చంద్రకుమార్‌, బార్‌ ప్రెసెడెంట్‌ ఎన్‌.శ్రీనివాసరావు, లోక్‌ అదాలత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:56 PM