Share News

పని ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:38 PM

మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న ఫారం ఫాండ్స్‌ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం కౌన్సిల్‌ మెంబర్‌ అల్లు లావణ్యకుమార్‌ అధికారులను ఆదేశించారు.

పని ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాటు చేయండి

జియ్యమ్మవలస, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరుగుతున్న ఫారం ఫాండ్స్‌ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం కౌన్సిల్‌ మెంబర్‌ అల్లు లావణ్యకుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మండలంలోని గెడ్డతిరువాడ, బీజే పురం గ్రామాల్లో పర్యటించి ఫారం ఫాండ్స్‌ పనులను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారంతా ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా ఒక పూట మాత్రమే పనులు చేయగలమని, టెంట్లు ఏర్పాటు చేయాలని, బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాలపై రాష్ట్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడి రెండు, మూడు రోజుల్లోనే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం ఏపీవో తులసిదాస్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:38 PM