Share News

సమన్వయంతో సేవలు అందించాలి

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:30 AM

జిల్లాలోని పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ అన్నారు.

సమన్వయంతో సేవలు అందించాలి

  • నేర సమీక్షలో డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ

విజయనగరం క్రైం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులతో అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఐజీతో పాటు కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత ముఖ్య అతిఽథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. ఇటీవల నమోదవుతున్న గంజాయి, మత్తుపదార్థాల కేసుల్లో విద్యార్థులు అరెస్టు అవుతుండడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇటువంటి వారిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి డి-ఆడిక్షన్‌ కేంద్రానికి పంపి అవసరమైన వైద్యం అందించాల న్నారు. ‘సాంకేతిక నైపుణ్యాన్ని పోలీసు అధికారులు మెరుగుపరుచు కోవాలి. శివారు ప్రాంతాల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాలి. అనధికారికంగా ఎవరైనా ఆయుధాలు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం.’అని అన్నారు. కలెక్టర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీసుశాఖ చక్కగా పనిచేస్తుందని తెలిపారు. గత ఏడాది పైడిమాంబ ఉత్సవంలో ఎటువంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేశారన్నారు. ఈ ఏడాది అదే ఒరవడితో ముం దుకు వెళ్లాలని అన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. త్వరలో జిల్లా పోలీసు శాఖ కు 34 డ్రోన్లు అందిస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి బబిత మాట్లాడుతూ.. మహిళలు బస చేసే వసతి గృహాల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. న్యాయస్థానాల్లో ప్రాసిక్యూషన్‌ వేగవంతంగా పూర్తయ్యే విధంగా చూసేందుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని నియమించాలని కలెక్టర్‌ను కోరారు. సెప్టెంబరు 13న నిర్వహించనున్న లోక్‌అదాలత్‌ కార్యాక్రమం విజయవంతమయ్యే విధంగా చూడాలని పోలీసు అధికారులను కోరారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు జిల్లా పోలీ సుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. మహిళల భద్రత, రహదారి భద్రత, శక్తియాప్‌, సైబర్‌ నేరాలు పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గంజాయి కేసుల్లో సమర్థవంతంగా విచారణ పూర్తి చేసిన ఎస్‌.కోట సీఐ నారాయణమూర్తి, బొబ్బిలిరూరల్‌ సీఐ నారాయణరావును అభినందించి, ప్రశంశాపత్రాలు అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, రవాణాశాఖ ఉప కమిషనర్‌ మణికుమార్‌, జిల్లా ఎక్సైజ్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనాథుడు, డీఎఫ్‌వో కొండలరావు, డీఎంహెచ్‌వో జీవనరాణి, డీఈవో కేవీ రమణ, నగరపాలకసంస్థ అసిస్టెంట్‌ కమిషనర్‌ అప్పలరాజు, డీఎస్పీలు శ్రీనివాసరావు, భవ్యారెడ్డి, రాఘవులు, గోవిందరావు, వీరకుమార్‌, న్యాయ సలహాదారులు పరుశురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ నేరాల నియంత్రణలో సాంకేతికతను వినియోగించుకోవాలని డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌ ప్రాంగణం, కమాండ్‌ కంట్రోల్‌ రూం పనితీరును పరిశీలించి సీఐకు పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌, డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ లీలారావు, టూటౌన్‌ సీఐ శ్రీనివాసరావు, తదితరలు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:30 AM