‘AgriGold’ ‘అగ్రిగోల్డ్’ టేకు చెట్లపై నివేదికలు పంపండి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:48 PM
Send Reports on ‘AgriGold’ Teak Trees అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న టేకు చెట్ల వివరాలపై త్వరగా నివేదికలు అందించాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ ఆదేశించారు. బుధవారం చోళపదం, ఉలిపిరి పంచాయతీల పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు, టేకు చెట్లను పరిశీలించారు.
కొమరాడ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న టేకు చెట్ల వివరాలపై త్వరగా నివేదికలు అందించాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ ఆదేశించారు. బుధవారం చోళపదం, ఉలిపిరి పంచాయతీల పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు, టేకు చెట్లను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి పలు వివరాలనుు రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ.. స్థానిక రైతుల జిరాయితీ భూములు అగ్రిగోల్డ్ భూములుగా ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయన్నారు. ఆయన వెంట సీఐడీ, అటవీశాఖ అధికారులు , సర్వేయర్ వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.