అక్రమంగా నిల్వ చేసిన విత్తనాలు, పురుగు మందులు సీజ్
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:19 AM
పూసపాటిరేగలో కొవ్వాడకు వెళ్లే మార్గంలో గల ఒక లేఅవుట్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మొక్కజొన్న విత్తనాలు, కలుపు నివారణ మందులను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.
పూసపాటిరేగ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పూసపాటిరేగలో కొవ్వాడకు వెళ్లే మార్గంలో గల ఒక లేఅవుట్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మొక్కజొన్న విత్తనాలు, కలుపు నివారణ మందులను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఒక కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలు, పురుగు మందులు ఇక్కడ అక్రమంగా నిల్వ చేసినట్టు మండల వ్యవసాయ అధికారిణి నీలిమ సమాచారం తెలుసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం అక్కడకు చేరుకున్నారు. పురుగు మందుల నిల్వలను, మొక్కజొన్న విత్తనాలను పరిశీలించారు. వాటికి ఎటువంటి బిల్లులు లేకపోవడాన్ని గుర్తించారు. జిల్లాలో ఏ డీలరు వద్ద నుంచి గానీ కొనుగోలు చేసినట్టు లేదు. దీంతో 2,615 కిలోల మొక్కజొన్న విత్తనాలు, 254 కిలోల కలుపు నివారణ మందులను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.9లక్షలు ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కంపెనీపై 6ఏ కేసును నమోదు చేస్తున్నట్టు చెప్పారు. స్థానిక వీఆర్వో, పోలీసులు, వ్యవశాయశాఖ అధికారులు వీటిని సీజ్ చేశారు. ఇదే పరిశ్రమ గతే ఏడాది కూడా ఇదే విధంగా అక్రమంగా విత్తనాలు, పురుగు మందులు నిల్వ చేసి, రైతులకు పంపిణీ చేసినట్టు ఉన్న సమాచారంతో వ్యవశాయ శాఖ దీనిపై దృష్టి సారించింది.