కార్యదర్శులపై చిన్నచూపు తగదు
ABN , Publish Date - May 06 , 2025 | 12:23 AM
ఇటీవల పంచాయతీల కార్యదర్శులపై జేసీ చేసిన వ్యాఖ్యలపై వారు ఖండించారు.
గరుగుబిల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పంచాయతీల కార్యదర్శులపై జేసీ చేసిన వ్యాఖ్యలపై వారు ఖండించారు. ఈమేరకు సోమవారం స్థానిక ఎంపీడీవో జి.పైడితల్లికి వినతిపత్రం అందించారు. ఇటీవల జేసీ ఓ సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ కార్య దర్శులు సచివాలయాల సిబ్బందితో సమానమే నని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. సిబ్బందికి జీతాలు చెల్లించేంతవరకే కార్యదర్శుల బాధ్యత అని వ్యాఖ్యానించడం విచారకరమన్నారు.
సాలూరు రూరల్: గ్రామ సచివాలయా ల్లో తమ విధులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకుంటే క్లస్టర్ విధులకే పరిమితమవు తామని సాలూరు మండల కార్యదర్శులు స్పష్టం చేశారు. జేసీ ఈనెల 2న సమావేశంలో పంచాయతీ కార్యదర్శులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వారి సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో సోమవారం సాలూరు ఎంపీడీవో గొల్లపల్లి పార్వతికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో తాము డీడీవోలు గా ఉన్నామని తెలిపారు. సచివా లయాల్లో తాము ఏమేమి చేయా లో స్పష్టమైన మార్గదర్శకాలిస్తే ఆయా పనులు చేయడానికి సిద్ధమన్నారు. మార్గదర్శకాలు వచ్చే వరకు తమ క్లస్టర్ పనులు చేసుకుంటామని స్పష్టం చేశారు.
భామిని: తమ విధులు, కార్య ప్రణాళికలు రాత పూర్వకంగా తెలియజేయాలని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది కోరారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కె.సత్యంకు సోమవా రం వినతిపత్రం అందజేశారు.
కురుపాం: జేసీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వద్ద ఎంపీడీవో జె.ఉమామహేశ్వరికి వినతిపత్రం అందజేశారు. సంఘం అధ్యక్ష్య, కార్యదర్శులు పాల్గొన్నారు.