Share News

పారిశుధ్య పనులపై కార్యదర్శులు దృష్టి పెట్టండి

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:53 PM

: గ్రామాలలో పారిశుధ్య పనులు చేయించడంపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలని జిల్లా పరిషత్‌ సీఈఓ బి.వి. సత్యనారాయణ అన్నారు.

పారిశుధ్య పనులపై కార్యదర్శులు దృష్టి పెట్టండి
కొత్తవలస: గ్రామస్తులతో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో :

కొత్తవలస, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామాలలో పారిశుధ్య పనులు చేయించడంపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలని జిల్లా పరిషత్‌ సీఈఓ బి.వి. సత్యనారాయణ అన్నారు. బుధవారం అప్పన్నపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. గ్రామ సర్పంచులు, వార్డుమెంబర్లు, గ్రామ పెద్దలు పంచాయతీ కార్యదర్శులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇన్‌చార్జి ఎంపీఈఓ శ్రీదేవి పాల్గొన్నారు.

పారిశుధ్యం మెరుగుకు కృషి

భోగాపురం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యంపై పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని డీపీవో మల్లికార్జునరావు సూచించారు. రెడ్డికంచేరు గ్రామంలో ఆయన బుధవారం పారిశుధ్య పనులను పరిశీలించారు. తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో గాయతి, కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు.

రక్షిత నీటిని వినియోగించాలి

చీపురుపల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డివిజినల్‌ అభివృద్ధి అధికారి ఎస్‌.హేమసుందర్‌ సూచించారు. బుధవారం ఆయన దేవరపొదిలాం గ్రామాన్ని సందర్శించారు. మురుగు కాలువలు, తాగునీటి కుళాయిలను పరిశీలిం చారు. గ్రామంలో చెత్త పేరుకుపోకుండా శుభ్రం చే యాలన్నారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:53 PM