సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:19 AM
అప్పుల బాధ తాళలేక సచివాలయ ఉద్యోగి మృతిచెందిన ఘటన మంగళవారం విజయనగరం గౌడవీధిలో చోటుచేసుకుంది.
విజయనగరం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక సచివాలయ ఉద్యోగి మృతిచెందిన ఘటన మంగళవారం విజయనగరం గౌడవీధిలో చోటుచేసుకుంది. గౌడవీధికి చెందిన ఎం.అవినాస్(32) మెరకముడిదాం మండలం ఊటపల్లి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అప్పుల బాధ తాళ లేక మంగళవారం తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్ ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.