Crime Investigation నేర పరిశోధనలో అ‘ద్వితీయ’ం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:40 PM
Second to None in Crime Investigation నేరాల పరిశోధనలో సాధించిన పురోగతికి సంబంధించి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించే ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) ర్యాంకింగ్‌లో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు శుక్రవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ మాధవరెడ్డి అవార్డు అందుకున్నారు.
డీజీపీ చేతులమీదుగా అవార్డు అందుకున్న ఎస్పీ
బెలగాం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): నేరాల పరిశోధనలో సాధించిన పురోగతికి సంబంధించి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించే ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) ర్యాంకింగ్‌లో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు శుక్రవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ మాధవరెడ్డి అవార్డు అందుకున్నారు. కొన్ని నెలల కిందట సాలూరు మండలం చీపురు వలస జీడితోట వద్ద ఓ మహిళ మృతదేహం వేలాడటాన్ని గుర్తించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఈ కేసును 48 గంటల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నారు. ఇందులో క్రియాశీలంగా పనిచేసిన ఎస్పీ మాధవరెడ్డిని, ఏఎస్పీ అంకిత సురాన, సీఐ, పోలీస్ సిబ్బందిని డీజీపీ అభినందించారు. ప్రతి మూడు నెలల్లో ఛేదించిన కేసులు, దర్యాప్తులను పరిశీలించి జిల్లాకు అవార్డు అందించినట్లు ఎస్పీ వెల్లడించారు.