జమ్ము ఘటనపై సీన్ రిక్రియేషన్
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:56 PM
ఇటీవల జమ్ము గ్రామంలో దుర్గాదేవి నిమజ్జనంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య చెలరేగిన గొడవను శనివారం రిక్రియేషన్ చేశారు.
గుర్ల, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఇటీవల జమ్ము గ్రామంలో దుర్గాదేవి నిమజ్జనంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య చెలరేగిన గొడవను శనివారం రిక్రియేషన్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన 25 మంది విశాఖ జైలులో ఉన్నారు. సీన్ రిక్రియేషన్ కోసం వారిని శనివారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి జమ్ము గ్రామానికి వాహనాల్లో తీసుకువచ్చారు. ఉదయం నుంచి గ్రామంలో పోలీసులు పహారా కాశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. నిందితులను తీసుకువచ్చి సంఘటనా స్థలం వద్ద కొంతసేపు ఉంచారు. అక్కడి ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే నిందితులను తమ వాహనాల్లో విశాఖపట్నం తరలించారు. ఈ కేసులో మరికొంతమంది నిందితులను అరెస్టు చేయను న్నట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు.