ఎస్సీ వర్గీకరణతో ఉపకులాలకు మేలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:49 PM
ఎస్సీ వర్గీకరణతో ఉపకులాలకు మేలు జరుగు తుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచం ద్ర తెలిపారు. గురువారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్ కులా లకు విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని తెలిపారు.
బెలగాం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ వర్గీకరణతో ఉపకులాలకు మేలు జరుగు తుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచం ద్ర తెలిపారు. గురువారం పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్ కులా లకు విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. దశాబ్దాల కలగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సాకారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉం టామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదించారని, ప్రస్తుతం చట్టబద్దత కల్పించడం ఎస్సీలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి నిదర్శమని తెలిపారు.విద్య, ఉద్యోగాలు ఇప్పటివరకు పొందని ఉప కులాలకు సమానఅవకాశాలు లభిస్తాయని చెప్పారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం చేయడంతోపాటు జబాబుదారీ ప్రభుత్వం పని చేస్తోం దని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దివ్య, ఆనందరావు, నాయకులు శ్రీదేవి, రాజశేఖర్ పాల్గొన్నారు.
అమ్మవార్ల పండగను విజయవంతగా నిర్వహించండి
పార్వతీపురం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : పార్వతీపురంలోని ఇప్పల పోలమ్మ, ఎర్రకంచమ్మ అమ్మవార్ల పండగను విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించారు.గురువారం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు.