‘యోగాంధ్ర’లో సత్తాచాటాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:53 PM
ఎన్టీఆర్ జిల్లాలో సోమ, మంగళవారం నిర్వహించే రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాస్థాయి విజేతలు ఆదివారం కలెక్టరేట్ నుంచి బస్సులో బయలుదేరి వెళ్లారు.

- డీఆర్వో హేమలత
- రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విజేతలు
పార్వతీపురం/బెలగాం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లాలో సోమ, మంగళవారం నిర్వహించే రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాస్థాయి విజేతలు ఆదివారం కలెక్టరేట్ నుంచి బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా డీఆర్వో హేమలత మాట్లాడుతూ.. జిల్లాస్థాయి విజేతలు రాష్ట్రస్థాయిలో కూడా సత్తా చాటాలన్నారు. మన్యం జిల్లా పేరు, ప్రతిష్టలను పెంచాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని తిరిగి స్వస్థలాలకు చేరుకునే వరకూ వారికి సహాయ, సహకారాలు అందించేందుకు నోడల్ అధికారిగా ట్రైబల్ వెల్ఫేర్ డీడీ కృష్ణవేణి, లైజన్ ఆఫీసర్‌గా డా.రఘు, యోగా మాస్టర్ మోహన్ గంటాయత్, వివిధ శాఖల అధికారులను నియమించారు. కార్యక్రమంలో యోగాంధ్ర జిల్లా కన్వీనర్ డా.టి.జగన్మోహన్‌రావు, ఏవో సీహెచ్.రాధాకృష్ణ, డీటీ లక్ష్మీకుమార్ తదితరులు పాల్గొన్నారు.