సత్యసాయిబాబా ఉపదేశాలు సమాజానికి మార్గదర్శకాలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:54 PM
భగవాన్ సత్యసాయిబాబా ఇచ్చిన ఉపదేశాలు సమాజానికి శాశ్వత మార్గదర్శకాలు అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): భగవాన్ సత్యసాయిబాబా ఇచ్చిన ఉపదేశాలు సమాజానికి శాశ్వత మార్గదర్శకాలు అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం సత్యసాయిబాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాబా ఎల్లప్పుడూ చెప్పిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస విలువలు ప్రతిఒక్కరి జీవితంలో ఆచరణీయమైనవని అన్నారు. ప్రేమ, సేవ, మానవతా తత్వాలతో సమాజం ముందుకు సాగితేనే బాబా ఆశయాలు నిజంగా నెరవేరుతాయని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కూడా ఈ సేవా భావానికి ప్రతీకలని మంత్రి పేర్కొన్నారు. అనంతరం సత్యసాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, సేవాదళ సభ్యులు, మహిళా సంఘాలు, స్థానిక భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.